Home Blog

రాజమౌళి-మహేశ్ చిత్రం పుకార్లపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ

0
rajamouli mahesh babu

RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తదుపరి చిత్రంపై అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో తన తదుపరి చిత్రం అని జక్కన్న ప్రకటించండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ పాత్ర హనుమంతుని స్ఫూర్తితో తెరకెక్కనుందనే వార్త కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గాసిప్స్ పై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) క్లారిటీ ఇచ్చారు.

తన కుమారుడు రాజమౌళికి పౌరాణిక కథలు అంటే చాలా ఇష్టమని.. అందుకే తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయన్నారు. మహేశ్(Mahesh Babu) తో చిత్రంలో కూడా ఆ మూలాలు ఉంటాయి.. కానీ హనుమంతుని స్ఫూర్తితో మాత్రం ఉండదని స్పష్టంచేశారు. అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కాగా ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అయిపోగానే రాజమౌళి చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో భారీ బడ్జెట్ తో జక్కన్న తెరకెక్కించనున్నాడు.

రాత పరీక్ష లేదు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ.. ఈ ఉద్యోగ సమాచారం మీకోసం..

0

Kendriya Vidyalaya Jobs |ప్రయివేట్ ఉద్యోగాలంటే సరే.. నైపుణ్య పరీక్ష.. ఇంటర్వ్యూలో ఓకే అయితే ఉద్యోగం గ్యారంటీ.. కాని ప్రభుత్వ రంగ లేదా అనుబంధ సంస్థల్లో రెగ్యులర్‌ లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం రావాలన్నా కొన్నిసార్లు రాత పరీక్ష రాయాల్సిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ఆ తర్వాత.. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. చాలామంది రాత పరీక్ష అంటే చాలు భయపడిపోతూ ఉంటారు. రాసినా రాదులే అనే ఉద్దేశంతో ఉంటారు. అయితే హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలాంటి విద్యార్హతలు ఉండాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం.

ఉద్యోగ ఖాళీలు, అర్హతలు : ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కోచ్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్‌, కామర్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, హాకీ/ అథ్లెటిక్స్‌, యోగా విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థులు కచ్చితంగా సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్‌, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,250 నుంచి రూ. 27,500 వరకు జీతం చెల్లిస్తారు.

ఇంటర్వ్యూలను మార్చి 07వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి నిర్వహిస్తారు.

NPS |నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో డెత్‌ బెనిఫిట్స్‌ ఎలా పొందాలో తెలుసుకోండి..

0

NPS |భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చాలా మంది నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌లో తమ నగదు పొదుపు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పథకంలో పొదుపు చేసిన చందాదారుడు మరణిస్తే అతడి డెట్‌ బెనిఫిట్స్‌ ఎలా పొందాలనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఏదైనా పొదుపు పథకాల్లో ఖాతాదారుడు లేదా చందాదారుడు మరణిస్తే అతడు పొదుపు చేసిన నగదు మరణాంతరం కుటుంబ సభ్యులు లేదా నామినిగా పొందుపర్చిన వ్యక్తికి అందజేశారు.

NPS |నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. ఈ ఇదొక స్వచ్చంద రిటైర్ మెంట్ ప్రొగ్రామ్. ఇది మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ను అందిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ తో పాటు, మరణం సంభవిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఇందులో చందాదారులు స్వయంగా ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను, రిటైర్ మెంట్ ఫండ్ ను రూపొందించుకోవచ్చు.

ప్రభుత్వేతర రంగంలో ఉన్న నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌ చందాదారుడు మరణిస్తే, ఆ వ్యక్తి నామినీ కానీ, చట్టబద్ధ వారసులు కానీ డెత్ బెనిఫిట్స్ పొందవచ్చు. డెత్ బెనిఫిట్స్ లో మొత్తం డబ్బును ఒకేసారి పొందవచ్చు. లేదా పెన్షన్ పొందడానికి వీలుగా యాన్యుటీని కొనుగోలు చేసుకోవచ్చు. నామినీ లేదా చట్టబద్ధ వారసులు చనిపోయిన చందాదారుడి డెత్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారుల నుంచి తీసుకోవాలి. ఎన్పీఎస్‌ చందాదారుడు ఇఎన్‌పిఎస్‌ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఉంటే, అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి విత్ డ్రా ఫామ్ ను ఫిల్ చేసి, ఎన్పీఎస్ ట్రస్ట్‌కు సబ్‌మిట్ చేయాలి.

విత్ డ్రా ఫామ్ తో పాటు డెత్ సర్టిఫికెట్ ను, నామినీ లేని పక్షంలో చట్టబద్ధంగా తామే వారసులమని నిర్ధారించే పత్రాలను, కేవైసీ డాక్యుమెంట్స్ ను, బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. Www.npscra.nsdl.co.in వెబ్ సైట్ నుంచి విత్ డ్రా ఫామ్ ను డౌల్ లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ లోనే అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్ కూడా ఉంటుంది. అవసరమైన వెరిఫికేషన్ పూర్తయిన తరువాత డెత్ బెనిఫిట్స్ గా అందే మొత్తం నామినీ లేదా చట్టబద్ధ వారసుల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.

టీవీ ఛానెల్ లో కీచకుడు.. రంగంలోకి దిగిన పోలీస్!

0

తెలుగు నాట టీవీ యాంకర్లకు రక్షణ లేదా

ఛానెల్స్ లోనే కీచకులు కాచుకొని ఉన్నారా

ఆడపిల్లల్ని కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంటారా

ఒక ప్రముఖ ఛానెల్ లో ఇదే బాగోతం వెలుగు చూసిందా

ఛానెల్ హెడ్ నుంచే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయా

ఎదురు తిరిగితే భవిష్యత్ ఉండదని బెదిరిస్తున్నారా

పోలీసు స్టేషన్ కు వెళ్లలేని స్థితిలో అమ్మాయిలు కుమిలిపోతున్నారా

బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ట్వీట్ తో బండారం బయట పడిందా

హైదరాబాద్ టీవీ ఛానెల్స్ గుట్టు రట్టు అయినట్లేనా.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Viveka Murder Case | వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రపై సీబీఐ సంచలన రిపోర్ట్

0

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య గురించి ఉదయ్ కి ముందే తెలుసని.. హత్య(Viveka Murder Case) జరిగిన రోజు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని సీబీఐ తెలిపింది.

హత్య జరిగిందని తెలిశాకే ఉదయ్ బయటకు వచ్చినట్లు పేర్కొంది. అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy), భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపేశారని చెప్పింది. ఈ కేసులో ఉదయ్ ని ఎన్నిసార్లు విచారించినా సహకరించలేదని.. అందుకే పారిపోతాడనే అనుమానంతో అరెస్ట్ చేశామని రిపోర్టులో స్పష్టంగా తెలియజేసింది. కాగా ఉదయ్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.

“పాలమ్మిన.. పూలమ్మిన” డైలాగ్ చెప్పిన కేటీఆర్

0

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అందరితో సరదాగా మాట్లాడుతుంటారు. ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ‘పాలమ్మిన.. పూలమ్మిన’ అనే డైలాగ్ తో ఆయన పాపులర్ అయ్యారు. తాజాగా మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి ఆ ప్రాంత సమస్యల గురించి కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డితో మామూలుగా ఉండదు.. ఆయన మాట్లాడితే మనం మాట్లాడటానికి ఏం ఉండదని వ్యాఖ్యానించారు. అలాగే మల్లారెడ్డి పాపులర్ డైలాగ్ ‘పాలమ్మిన.. పూలమ్మిన’ డైలాగ్ చెప్పి ప్రజల్లో జోష్ నింపారు.

జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?

0

దేశంలోని మూడు పార్టీల జాతీయ హోదా గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అసలు జాతీయ పార్టీ హోదా పొందాలంటే అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా పార్టీ జాతీయ పార్టీ కావాలంటే ముందు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6శాతం ఓట్లతో పాటు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవాలి. అలా లేని పక్షంలో లోక్ సభ ఎన్నికల్లో 6శాతం ఓట్లు, ఓ ఎంపీ సీటు అయినా సాధించాలి. అది కాదంటే అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో కనీసం 8శాతం ఓట్లు పొందాలి. అప్పుడే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ గుర్తింపు వస్తుంది.

అలా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాతీయ హోదా పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలను పాటించాలి. అవి ఏంటంటే….

కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. లేదంటే కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా 2శాతం ఓట్లు సాధించాలి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లేదా ఎక్కువ రాష్ట్రాల్లో 6శాతం ఓట్లతో పాటు కనీసం 4ఎంపీ సీట్లు గెలవాలి. అప్పుడే ఆ పార్టీకి జాతీయ హోదా లభిస్తుంది.

కేంద్రం తాజాగా మూడు పార్టీల జాతీయ హోదాను రద్దు చేయడంతో ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, ఎన్పీపీ, ఆప్ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా కొనసాగనున్నాయి.

Love: ప్రేమలో ఫెయిల్యూర్‌ ఉంటుందా.. లవ్‌ అంటే అదొక్కటేనా..

0

Love: ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కాని.. ఒకే ఒక్క డైలాగ్‌ లాస్ట్‌ ఇయర్‌ అంతా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అయింది. ఇప్పటికి ఆ డైలాగ్‌ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అదేనండి.. బంగారం డైలాగ్‌.. బంగారం ఒకటి చెప్పనా.. చెట్టుకు నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ విలువ నీకు తెలిసేది.. ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయిపోయింది. ఈ ఒకే ఒక్క డైలాగ్‌ ప్రేమ యొక్క గొప్పతనాన్ని.. లవ్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఆ ప్రేమ ఎలా ఉండాలనే సంకేతాన్ని ఇచ్చి ఉండొచ్చు.. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలు ప్రతి ఒక్కరి జీవితంలో తియ్యని జ్ఞాపకం. ప్రేమ ఎలా పుడుతుందో.. ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం అసలు ప్రేమ అంటే ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య ఉండేదే అని ఎక్కువమంది భావిస్తారు. కాని ప్రేమ అనే రెండే రెండు అక్షరాలు.. అబ్బాయి.. అమ్మాయి మధ్య ప్రేమకు మాత్రమే పరిమితం కాదు.. ప్రేమ అనేది కుటుబం సభ్యులపై కావచ్చు.. స్నేహితులపై కావచ్చు.. లేదా కొంతమంది కొన్ని ప్రదేశాలను, వస్తువులను, ఆహార పదార్థాలను ప్రేమిస్తూ ఉంటారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడే ఆ ప్రేమ బలంగా ఉంటుంది. ప్రేమలో అతి పనికిరాదు.. అది ఎవరిపై అయినా.. అతి ఉంటే ఆ ప్రేమ స్వచ్ఛమైనదా కాదా అనే అనుమానం తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రేమలో నిజాయితీ ఉంటే అది ఏళ్ల తరబడి బలంగా ఉంటుంది. జీవితాంతం కావల్సిన ప్రేమను పంచుతుంది. చెట్టుకు లేదా మొక్కలకు నీళ్లు పోస్తేనే కాయలు, పండ్లు, పువ్వులు పూస్తాయనేది ఎంత వాస్తవం. అయితే జీవితంలో ప్రేమ కూడా నీరు లాంటిదనే చెప్పుకోవాలి. ప్రేమ ఉన్నప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది.. ఓ రకంగా చెప్పాలంటే పువ్వులా విరబూస్తుంది. పువ్వు రాలిపోతుంది కదా అనుకోవచ్చు.. కానీ చెట్టు బతుకుతుంది.

మరెన్నో పువ్వులను, కాయలను, పండ్లను మనకు అందిస్తుంది. అందుకే ప్రేమ నీరు లాంటిదని చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రేమ ఆక్సిజన్‌.. కూడా ప్రేమ ఓ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌గానూ చెప్పుకోవచ్చు. ప్రేమ లేకుంటే జీవితం లేదని అనుకోవడం కాదు కానీ.. జీవితంలో ప్రేమ ఉంటే.. ప్రేమించిన అంటే మనకు ఇష్టమన వ్యక్తి మనతో ఉంటే ఆ లైఫ్‌ బాగుంటుంది.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కష్టాలన్ని ఇట్టే మర్చిపోవచ్చు. ప్రేమ యొక్క రుచిని ప్రతి ఒక్కరు అనుభవించి తీరాలి. ప్రేమ ఇచ్చే ధైర్యం.. ప్రేమ ఇచ్చే కేరింగ్.. జ్ఞాపకాలు.. ఎప్పటికి మర్చిపోలేనివి. అందుకే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. లేదా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఎప్పటికి మర్చిపోలేము. ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఓ వ్యక్తిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది.. కాని ఏదైనా అతిగా తీసుకుంటే అది అనర్థమే చేస్తుంది. అందుకే అబ్బాయి.. అమ్మాయిల మధ్య లవ్‌ విషయంలో ఎక్కువ హోప్స్‌ పెట్టుకోకూడదు. ఎలా వెళ్తుందో దానిని అలా వెళ్లనిస్తే చాలా బెటర్‌.. దానిని ఏ మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఆ ప్రేమ అనే రెండు అక్షరాలు పాయిజన్‌గా కూడా మారవచ్చు. అందుకే చాలా మంది ఎక్కువ ప్రేమిస్తారు. సఫర్‌ అవుతారు.. ఒక్కోసారి జీవితాన్నే నాశనం చేసుకుంటారు. ఇవ్వన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అందుకే లవ్‌ విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

రూ.500కోట్లతో వన్డే వరల్డ్‌కప్‌ వేదికలకు కొత్త రూపురేఖలు

0
world-cup-2023

ODI WC 2023 : ఐపీఎల్ ఫీవర్ ముగిసిన వెంటనే దేశంలో వరల్డ్ కప్(Worlcup) మజా మొదలు కానుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో జరగనున్న ప్రపంచ కప్ కు 12సంవత్సరాల తర్వాత భారత్ ఆతిధ్యమివ్వనుంది. వరల్డ్ కప్ లో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి. దీంతో ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ(BCCI).. మ్యాచులు జరిగే స్టేడియాల లుక్ ను మార్చనుంది. ఇందుకోసం రూ.500కోట్లను కేటాయించింది.

మొత్తం ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేలా కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలి, ముంబైలోని వాంఖడే స్టేడియాల్లో వసతులను మెరుగుపర్చనుంది. ఈసారి వరల్డ్ కప్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఆతిథ్యం ఇవ్వనుండడంపై తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ స్టేడియం మరమ్మత్తులకు రూ.117.17కోట్లు కేటాయించింది. ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, కోత్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియం కోసం రూ. 78.82 కోట్లు ఖర్చు పెట్టనుంది. కాగా చివరి సారిగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2011 వరల్డ్ కప్ ట్రోఫీని ధోని సేన సగర్వంగా ముద్దాడి కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చింది. మళ్లీ 12ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఈసారి కూడా టీమిండియా ప్రపంచ కప్ టైటిల్ ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Hello world!

1

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!